మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర వినాశం

ABN , First Publish Date - 2021-12-16T04:49:12+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్రం వినాశనమవుతోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర వినాశం
కోవూరులో రైతు సంఘీభావ యాత్రలో పాల్గొన్న పోలంరెడ్డి

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 


కోవూరు, డిసెంబరు 15 : రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్రం వినాశనమవుతోందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రైతు సంఘీభావ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి సమస్య కేవలం రైతు సమస్య కాదని.. ఐదుకోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు. రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు రావాలన్నా, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా అమరావతి రాజధానిగా ఉండాలన్నారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి బయలు దేరిన   యాత్రను తాలుకాఫీసు కూడలి వరకు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, ముసలి సుధాకర్‌, పంది రఘురామ్‌, మందా రవికుమార్‌, బాలారవి, చెంబేటి పెంచలయ్య, నాగరాజు, విజయ్‌, గౌతమ్‌, అభిలాష్‌, సూరిశెట్టి శ్రీనివాసులు, మహేష్‌, నాటకరాని వెంకట్‌, కొల్లారెడ్డి సుధాకరరెడ్డి, వీరేంద్ర, చెముకల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-16T04:49:12+05:30 IST