మునిసిపల్‌ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2021-03-25T04:23:42+05:30 IST

కార్మిక సమస్యల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు.

మునిసిపల్‌ కార్మికుల ధర్నా
ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

వెంకటగిరి, మార్చి 24: కార్మిక సమస్యల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి కల్లూరి జాన్‌ మాట్లాడుతూ కార్మికుల విషయంలో ఆఫ్‌కాస్‌ విధానం అమలు కావడం లేదన్నారు. రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడంతో పూటగడవక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపులు  ఇవ్వలేదన్న కారణంగా కొందరు అధికారులు కార్మికులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 


Updated Date - 2021-03-25T04:23:42+05:30 IST