ఘనంగా ముగిసిన దేవీ శరన్నరాత్రులు

ABN , First Publish Date - 2021-10-20T04:52:24+05:30 IST

మనుబోలులో సోమవారం అర్ధరాత్రి దుర్గాదేవిని భారీగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.

ఘనంగా ముగిసిన దేవీ శరన్నరాత్రులు
మహంకాళి అలంకరణలో మనుబోలులో గ్రామోత్సవం

మనుబోలు, అక్టోబరు 19: మనుబోలులో సోమవారం అర్ధరాత్రి దుర్గాదేవిని భారీగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. దీంతో దేవీ శరన్నరాత్రులు ఘనంగా ముగిశాయి. 11రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి ప్రత్యేక పూజలు, ఉభయాలు నిర్వహించారు. గజమాలలతో మనుబోలులో, కోదండరామపురంలో దుర్గాదేవిని మహంకాళి అవతారంలో అలంకరించారు. విద్యుద్దీపాల నడుమ, బాణసంచాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా మంగళవారం వరకు మనుబోలులో వీధుల్లో సాగాయి. చావిడిలో అమ్మవారి ముందు ఉంచిన లడ్డును వేలం  వేశారు.  రెండుచోట్ల నిర్వాహకులు గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.  గ్రామోత్సవం ముగిశాక కలిశోద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. Updated Date - 2021-10-20T04:52:24+05:30 IST