ఎంపీపీగా మెట్టుకూరు శిరీష బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-10-21T02:45:32+05:30 IST
కలిగిరి ఎంపీపీగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి సతీమణి మెట్టుకూరు శిరీష బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

కలిగిరి, అక్టోబరు 20: కలిగిరి ఎంపీపీగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి సతీమణి మెట్టుకూరు శిరీష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ మండలంలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరిస్తామన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. పార్టీలకతీతంగా పేదప్రజలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొన్నంరాజ్యలక్మి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.