లారీ ఢీకొని మోటారు సైకిలిస్టుకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-06-23T03:59:05+05:30 IST

మండలంలోని పండ్లూరు క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీ కొన్న ప్రమాదంలో మోటారు సైకిలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

లారీ ఢీకొని మోటారు సైకిలిస్టుకు తీవ్ర గాయాలు

నాయుడుపేట టౌన్‌, జూన్‌ 22 : మండలంలోని పండ్లూరు క్రాస్‌రోడ్డు వద్ద లారీ  ఢీ కొన్న  ప్రమాదంలో మోటారు సైకిలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. మదన్‌మోహన్‌రావు మంగళవారం నాయుడుపేట నుంచి మోటారు సైకిల్‌పై నెల్లూరుకు  వెళ్తున్నాడు. చెన్నై నుంచి నెల్లూరు వెళ్తున్న లారీ ఢీకొనడంతో మదన్‌మోహన్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.


Updated Date - 2021-06-23T03:59:05+05:30 IST