మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , First Publish Date - 2021-10-30T03:31:21+05:30 IST

మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని చెగువేరా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మండ్ల సురేష్‌బాబు తెలిపారు.

మొక్కలు నాటి సంరక్షించాలి

గూడూరు, అక్టోబరు 29:  మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని చెగువేరా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మండ్ల సురేష్‌బాబు తెలిపారు. శుక్రవారం రెండో పట్టణ పరిధిలోని ఎగువవీరారెడ్డి పల్లిలో  మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓ ఫ్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ మృతిచెందిన రవికిరణ్‌ జ్ఞాపకార్థఽం ఆయన కుమార్తె అరుణ్య పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాల్‌, నరేష్‌, వెంకటేష్‌ , సుమన్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T03:31:21+05:30 IST