విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-07-15T03:56:03+05:30 IST

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం
అభివృద్ధి పనుల వివరాలు పరివవలిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

కావలిటౌన్‌, జూలై 14: విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని తుఫాన్‌నగర్‌, వైకుంఠపురంలోని సచివాలయాలను సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణంలోని వెంగళరావునగర్‌, వైకుంఠపురంలలో నిర్మించనున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు కేటాయించిన స్థలాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పన్నులు ప్రజలపై భారం అనుకోవద్దని చెత్త పన్ను కట్టడం వలన మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడుతుందని అడిగేదానికి హక్కు ఉంటుందన్నారు. త్వరలో వైకుంఠపురం, కలుగోళమ్మపేట మధ్యలో ఆర్వోబీ వంతెన నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, డీఈ శ్రీనివాసులు, నేతలు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గుడ్లూరు మాల్యాద్రి, చిన్నపుల్లయ్య, వేమిరెడ్డి విజయ్‌కుమార్‌, పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-15T03:56:03+05:30 IST