పోలేరమ్మ ఆశీస్సులు విస్తరింప చేయాలి

ABN , First Publish Date - 2022-01-01T04:38:39+05:30 IST

పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై గురువారం రాత్రి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి నిర్వాహకులతో సమీక్షించారు.

పోలేరమ్మ ఆశీస్సులు విస్తరింప చేయాలి
పోలేరమ్మ జాతరపై స్థానికులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌ రెడ్డి

జాతరపై ఎమ్మెల్యే రామిరెడ్డి సమీక్ష

కావలి, డిసెంబరు 31: పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై గురువారం రాత్రి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి నిర్వాహకులతో సమీక్షించారు. పోలేరమ్మ ఆశీస్సులు పాతూరికే కాకుండా కావలి పట్టణ వాసులందరికీ అందేలా జాతర నిర్వహించాలన్నారు. రైల్వే ట్రాక్‌కు పడమర ఉన్న ప్రజలు కూడా పోలేరమ్మ ఆశీస్సులు అందుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పరంగా తన వంతు సహకారం ఉంటుందని చెప్పారు. నిర్వహణ కమిటీలలో పట్టణంలోని ప్రముఖులందరినీ భాగస్వాములను చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు స్పందించారు.

జాతరకు పటిష్ట బందోబస్తు : డీఎస్పీ

కావలి పట్టణం పాతూరులో ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే పోలేరమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు. పాతూ రులోని ఆలయ ప్రాంతాన్ని 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావుతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించి ఆల య కమిటీ సభ్యుల తో చర్చించారు. డీఎస్పీ మాట్లాడు తూ పట్టణంలో 12 ఏళ్ల తరువాత జరిగే పోలేరమ్మ జాతరతో పాటు, కళుగోళశాంభవి అమ్మవారి జాతరకు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాట సురేంద్రరెడ్డి, కాటా శ్రీనివాసులురెడ్డి, ఈతముక్కల బాలమురళీరెడి,్డ ఎస్‌ఐ బాజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-01T04:38:39+05:30 IST