గ్రామ స్వపరిపాలనకు సచివాలయాలే వేదిక

ABN , First Publish Date - 2021-08-22T03:47:35+05:30 IST

గ్రామ స్వపరిపాలనకు సచివాలయాలు వేదికలని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

గ్రామ స్వపరిపాలనకు సచివాలయాలే వేదిక
సమావేశంలో మాట్లాడుతున్న రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరురూరల్‌, ఆగస్టు 21 : గ్రామ స్వపరిపాలనకు సచివాలయాలు వేదికలని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కందమూరులో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందచేసేందుకు సచివాలయాలు వారధిగా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, నాయకులు కమలాకర్‌రెడ్డి, హరిబాబుయాదవ్‌, ఏసునాయుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T03:47:35+05:30 IST