ఘనంగా మంత్రి గౌతంరెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-11-03T04:32:36+05:30 IST

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణ వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా  మంత్రి గౌతంరెడ్డి జన్మదిన వేడుకలు
సంగం : రక్తదానం చేస్తున్న మంత్రి అభిమానులు

ఆత్మకూరు, నవంబరు 2 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణ వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయం, మున్సిపాల్టీ, ఎంపీపీ మండల సమావేశ మందిరాల్లో వైసీపీ నేతలు పార్టీశ్రేణులతో కలిసి భారీకేకు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు కూడళ్లలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. బీఎస్‌ఆర్‌ సెంటర్‌లో భారీ కేక్‌ను కట్‌ చేసి బాణాసంచా వేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.వెంకటరమణమ్మ, వైస్‌ ఛైర్మన్లు డాక్టర్‌ కేవీశ్రావణ్‌కుమార్‌, షేక్‌ సర్దార్‌, వైసీపీ నేతలు పెమ్మసాని శ్రీనివాసులునాయుడు, నోటి వినయ్‌కుమార్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు , ఎంపీటీసీ సభ్యులు  పాల్గొన్నారు.

అనంతసాగరం : ఎంపీడీవో కార్యాలయంలో  మంత్రి  మేకపాటి గౌతంరెడ్డి పుట్టినరోజు వేడుకలను నాయకులు కేకు కట్‌ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంపూర్ణమ్మ, తహసీల్ధారు శ్రీనివాసులురెడ్డి, ఎంపీడీవో మధుసూదన్‌రావు, జడ్‌పీటీసీ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, అక్కలరెడ్డి అంకిరెడ్డి పాల్గొన్నారు.

మర్రిపాడు : మంత్రి మేకపాటి  గౌతంరెడ్డి పుట్టినరోజు సందర్భంగా  స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో వైసీపీ నాయకులు, కార్యర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో 50 కిలోల కేకును కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో  ఆ పార్ట మండల కన్వీనర్‌ బొర్రా సుబ్బారెడ్డి, మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులునాయుడు, జడ్‌పిటిసి సుధాకర్‌రెడ్డి వనిపెంట వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంగం : మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకుని మండలంలోని జెండాదిబ్బ, సంగం గ్రామాల్లో మంగళవారం  ఆయన అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కేకు కట్‌ చేసి పంపిణీ చేశారు. జండాదిబ్బలో వైసీపీ మండల కన్వీనర్‌ పులగం శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సిబ్బంది దాతల నుంచి, సంగంలో మంత్రి అభిమానుల నుంచి రక్తం సేకరించారు. కార్యక్రమంలో సర్పంచులు ఆనం ప్రసాద్‌రెడ్డి, శంకరయ్య, చందు, ఫణీంద్రరెడ్డి, ఎంపీటీసీలు మల్లికార్జునరెడ్డి, సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు శేఖరయ్య, రవీంద్రరెడ్డి, తుంగా దయాకర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సూరా శ్రీనివాసులు రెడ్డి, కరీముల్లా, మదన్‌మోహన్‌రెడ్డి, కోటారెడ్డి, మాజీ జట్పీటీసీ దేవసహాయం పాల్గొన్నారు. 

ఏ ఎస్‌ పేట  : స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.  50కిలోల కేకును కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. అన్నదానం చేశారు. దర్గాలో ప్రతేక్య ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో  జడ్పీటీసీ రాజేశ్వరమ్మ, రాజవోలు సోసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, మండల కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సందాని, నాయకులు జిలానిబాషా, కల్లూరు ప్రభాకర్‌రెడ్డి, పఠాన్‌ ఖదర్‌, షౌకత్‌ అలీ, వివేకనందరెడ్డి పాల్గొన్నారు.

  Updated Date - 2021-11-03T04:32:36+05:30 IST