భోజన కార్మికురాలిని విధుల్లోకి తీసుకోవాలని ధర్నా
ABN , First Publish Date - 2021-10-26T03:58:51+05:30 IST
విధుల నుంచి అక్రమంగా తొలగించిన మధ్యాహ్నభోజన కార్మికురాలు వెంకటరమణమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు.

నాయుడుపేట టౌన్, అక్టోబరు 25 : విధుల నుంచి అక్రమంగా తొలగించిన మధ్యాహ్నభోజన కార్మికురాలు వెంకటరమణమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కార్మికులు, సీఐటీయూ నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మఽధ్యాహ్నభోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ ఓజిలి కాలనీ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలుగా పనిచేస్తున్న వెంకటరమణమ్మను ఎలాంటి కారణాలు లేకుండా అక్రమంగా తొలగించారన్నారు. వెంకటరమణమ్మను విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కె రహనాబేగం, సభ్యులు విమలమ్మ, సుమతి, జయమ్మ, రమణమ్మ, సుగుణమ్మ, సీఐటీయూ నాయకులు ముకుంద, సీహెచ్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.