30న ఆత్మకూరులో మెగా జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2021-10-20T04:17:59+05:30 IST

నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నడుం బిగించారు. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శిక్షణ, నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు.

30న ఆత్మకూరులో మెగా జాబ్‌ మేళా

ఆత్మకూరు, అక్టోబరు 19 : నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నడుం బిగించారు.  ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శిక్షణ, నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆత్మకూరు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి కార్యాలయం నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. వెయ్యి మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌,  డిప్లొమో ఇన్‌ మెడికల్‌, ఫార్మసీ, బీఎస్సీ (కెమిస్ట్రీ)లను పూర్తి చేసిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.  జాబ్‌ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-10-20T04:17:59+05:30 IST