జీజీహెచ్‌ ఎదుట ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-12-09T04:09:51+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట వైద్య ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు.

జీజీహెచ్‌ ఎదుట ఉద్యోగుల నిరసన
నిరసన తెలుపుతున్న వైద్య ఉద్యోగులు

నెల్లూరు(వైద్యం) డిసెంబరు 8 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట వైద్య ఉద్యోగులు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు. బుధవారం భోజన విరామ సమయంలో ఈ నిరసన చేపట్టారు. యునైటెడ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ సందాని మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలన్నారు. పీఆర్‌సీతో పాటు ఇతర అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలన్నారు.

Updated Date - 2021-12-09T04:09:51+05:30 IST