మెడికల్‌ కిట్లు అందజేత

ABN , First Publish Date - 2021-05-25T03:01:42+05:30 IST

స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌ ఉన్న వారికి రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉచిత

మెడికల్‌  కిట్లు అందజేత
ఔషధ కిట్లు అందిన్న రెడ్‌క్రాస్‌ సభ్యులు

కలిగిరి, మే 24: స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌ ఉన్న వారికి రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉచిత ఔషధ కిట్లను రెడ్‌క్రాస్‌ మండల కన్వీనర్‌ ఎం వేణుగోపాలరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీటీ ఉమాదేవి మాట్లాడుతూ ఖరీదైన మందులు కొనుగోలు చేయలేని పేదవారికి రెడ్‌క్రాస్‌ తరపున ఉచిత ఔషధ కిట్లు అందించడం అభినందనీయమ న్నారు.  కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సభ్యులు ఎన్‌ ప్రభాకరరావు, కే దిలీప్‌కుమార్‌, వీఆర్వోలు పరిశుద్దరావు, రామకృష్ణ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-25T03:01:42+05:30 IST