వెలుగొండ అడవుల్లో మృతదేహం గుర్తింపు

ABN , First Publish Date - 2021-05-21T03:02:15+05:30 IST

మండలంలోని ఆల్తూరుపాడు సమీపంలో ఉన్న వెలుగొండ అడవుల్లో ఓ మృతదేహం పడివున్నట్లు పోలీసులకు గురువా

వెలుగొండ అడవుల్లో మృతదేహం గుర్తింపు
వెలుగొండ అడవుల్లో మృతదేహం

డక్కిలి, మే 20 : మండలంలోని ఆల్తూరుపాడు సమీపంలో ఉన్న వెలుగొండ అడవుల్లో ఓ మృతదేహం పడివున్నట్లు పోలీసులకు గురువారం సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ గోపీ సంఘటన స్ధలానికి చేరుకొని పరిశీలించారు, అడవులో గుర్తించిన మృతదేహం కడప జిల్లా అనుంపల్లికి చెందిన తిరుపతి నరసయ్య (50)ఽగా గుర్తించారు. నరసయ్య మూడేళ్ల క్రితం ఊరువదిలి వెళ్లిపోయాడు. అనంతరం గురువారం అడవుల్లో శవమై పడివుండడాన్ని పోలీసులు గుర్తించి బందువులకు సమాచారం అందించారు. కాగా మృతదేహం వున్న తీరు చూస్తుంటే నాలుగైదు రోజుల క్రితం చనిపోయి ఉంటాడడని పోలీసులు బావిస్తున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్గందం వెదజల్లుతుంది. నడుంభాగం వరకు జంతువులు పీక్కుతిని వేసి వున్నట్లు వుంది. తలబాగాన్ని బట్టి పోలీసులు మృతదేహం ఎవరదన్న విషయాన్ని గుర్తించ గలిగారు. ఇంతకి అతను ఎందుకు చనిపోయాడు అన్న వివరాలు తెలియాల్సి వుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-05-21T03:02:15+05:30 IST