మనుబోలులో సెన్సార్ వెలుగులు
ABN , First Publish Date - 2021-11-17T05:01:09+05:30 IST
మనుబోలు పంచాయతీలో ఇక నుంచి సెన్సార్ సాయంతో వీధిదీపాలు వెలగనున్నాయి.
మనుబోలు, నవంబరు 16: మనుబోలు పంచాయతీలో ఇక నుంచి సెన్సార్ సాయంతో వీధిదీపాలు వెలగనున్నాయి. ఇందుకు సంబంధించి మంగళవారం వీధి దీపాలకు సెన్సార్ యంత్రాలు అమర్చారు. ఈ సందర్భంగా సెన్సార్ మిషన్ గురించి ఆపరేటర్ శివకుమార్ మాట్లాడుతూ ఒకచోట ఏర్పాటు చేసే సెన్సార్‌తో 20 దీపాలు వెలుగుతాయన్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఇది పనిచేస్తుందన్నారు. మనిషి సాయం లేకుండానే సమయం ప్రకారం వెలుగులు నిస్తాయన్నారు. ఫీజులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. దీంతోపాటు కరెంటు భారం పంచాయతీలకు తగ్గుతుందన్నారు. మనుబోలు పంచాయతీ పాలకుల ఆదేశాలతో 15 సెన్సార్‌లు అమర్చుతున్నామన్నారు. మిగతా పంచాయతీల కార్యదర్శులు కోరితే గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెన్సార్ మిషన్ రూ.5వేల వరకు ఉంటుందన్నారు. ఎండకు, వానకు ఈ యంత్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.