ప్రైవేట్‌ టీచర్సకు నెలకు రూ.10 వేల ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-05-19T04:04:36+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు నెలకు రూ.10 వేల ప్రభుత్వం చెలించేలా చర్యలు తీసుకోవాలని కోరతూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి సీఐటీయూ నేతలు వినతి పత్రం సమర్పించారు.

ప్రైవేట్‌ టీచర్సకు నెలకు రూ.10 వేల ఇవ్వాలి
మంత్రి బాలినేనికి వినతిపత్రం అందజేస్తున్న నేతలు

మంత్రి బాలినేనికి సీఐటీయూ నేతల వినతి

నెల్లూరు(వైద్యం), మే 18 : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు నెలకు రూ.10 వేల ప్రభుత్వం చెలించేలా చర్యలు తీసుకోవాలని కోరతూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి సీఐటీయూ నేతలు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో నేతలు మంత్రిని కలిశారు. టార్గెట్‌ పూర్తి చేయని వారికి వేతాలలో విద్యాసంస్థలు కోత విధిస్తున్నాయన్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఎవ్వరిని తొలగించవద్దని ప్రభుత్వం ఆదేశాల జారీ చేసినా అవి ప్రైవేట్‌ విద్యాసంస్థలలో అమలు కావడం లేదన్నారు. చాలా మంది టీచర్స్‌ ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలని కోరారు. అలాగే మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ కుమార్‌యాదవ్‌లను కూడా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రైవేట్‌ టీచర్స్‌ లెక్చరర్‌, ప్రొఫెసర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, అజయ్‌కుమార్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర నేత పరంధామయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నందకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-19T04:04:36+05:30 IST