మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2021-10-26T03:44:54+05:30 IST
జ్యాంగపరంగా మహిళలకు సంక్రమించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మహిళా సంరక్షణ అధికారులు కోరారు.

కోట, అక్టోబరు 25 : రాజ్యాంగపరంగా మహిళలకు సంక్రమించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మహిళా సంరక్షణ అధికారులు కోరారు. కోటలోని స్త్రీశిశు సంక్షేమ భవనంలో సోమవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అంగన్‌వాడీ వర్కర్లకు గృహహింస, మహిళా చట్టాలు, దిశ చట్టం, బాల్య వివాహాలు, చైల్డ్ హెల్ప్‌లైన్ మహిళలు మానసికంగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించారు. మహిళలలో ఎక్కువగా ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలోజిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, సఖీ, జ్యోత్స్న, పద్మ, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు కవిత, జ్యోతి,. పద్మ, సుభాషిణి పాల్గొన్నారు.