నెల్లూరు జిల్లాకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-21T17:14:20+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది.

నెల్లూరు జిల్లాకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

నెల్లూరు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర  నెల్లూరు జిల్లాకు చేరుకుంది. కావలి మండలం, రాజువారి చింతల పాలెంలో రాత్రి బసచేశారు. అర్దరాత్రి సమయంలో భారీ వర్షంతో టెంట్లు కూలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రాజువారి చింతల పాలెం, చలంచర్ల మీదుగా కావలి వరకు మహాపాదయాత్ర సాగనుంది. రైతులకు మద్దతిచ్చేందుకు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. చలంచర్లలో సుజనాచౌదరి, పురందీశ్వరి తదితరులు రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. కాగా బయట ప్రాంతాల నుంచి ఎవరూ రాకూడదంటూ ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-21T17:14:20+05:30 IST