‘లోక్‌అదాలత’లో ప్రథమ స్థానంలో నిలుద్దాం

ABN , First Publish Date - 2021-08-22T05:10:40+05:30 IST

లోక్‌అదాలత ద్వారా కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా 3వ స్థానంలో ఉందని, సెప్టెంబరు 11న జరగనున్న లోక్‌అదాలతలో మొదటి స్థానంలో నిలవాలని జిల్లా జడ్జి సీ.యామిని సూచించారు.

‘లోక్‌అదాలత’లో   ప్రథమ స్థానంలో నిలుద్దాం
ఇనస్పెక్టర్‌ మధుబాబుకు ప్రశంసా పత్రం అందజేస్తున్న జిల్లా జడ్జి

నేర సమీక్షలో జిల్లా జడ్జి యామిని


నెల్లూరు (క్రైం), ఆగస్టు 21 : లోక్‌అదాలత ద్వారా కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా 3వ స్థానంలో ఉందని, సెప్టెంబరు 11న జరగనున్న లోక్‌అదాలతలో మొదటి స్థానంలో నిలవాలని జిల్లా జడ్జి సీ.యామిని సూచించారు. శనివారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స సమావేశ మందిరంలో జరిగిన నేర సమీక్షలో  ఆమె మాట్లాడుతూ ప్రజలకు పోలీసు, న్యాయశాఖ సమన్వయంతో న్యాయం చేయాలన్నారు. ఎస్పీ విజయరావు జిల్లాలోని స్టేషన్ల వారీగా సమీక్షించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టాలని, చీకటి ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, జైల్‌ మానటరింగ్‌ పటిష్టగా అమలు చేయాలన్నారు.


పోలీసులకు ప్రశంసా పత్రాలు


విధి నిర్వాహణలో నెల రోజుల్లో ప్రతిభ కనపరిచిన 28 మంది పోలీసులకు ఎస్పీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  యామిని ప్రశంసా పత్రాలు అందజేయించారు. దిశ యాప్‌ అధికంగా డౌనలోడ్‌ చేయించడంలో ప్రథమ స్థానంలో చిన్నబజారు ఇనస్పెక్టర్‌ మధుబాబు, గూడూరు సబ్‌ డివిజన పరిధిలో ఎస్సై శ్రీనివాసరెడ్డి, దర్యాప్తు కేసు పరిష్కరించడంలో నెల్లూరు గ్రామీణ ఇనస్పెక్టర్‌ కె.వెంటరెడ్డి, వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా కాపాడిన సంతపేట బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు కె.మదనకుమార్‌, బి పుల్లయ్య, దగదర్తి మండలంతో జరిగిన హత్య కేసులో సమాచారం రాబట్టేందుకు కృషి చేసిన బుచ్చిరెడ్డిపాలెం కానిస్టేబుల్‌ కె.వెంకటబాబు తదితర 28 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసులు నాయక్‌, మెదటి అదనపు జిల్లా జడ్జి రమేష్‌కుమార్‌, ఏఎస్పీ పీ.వెంకటరత్నం, సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీలక్ష్మి, ఏఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, డీఎస్పీలు, ఇనస్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-22T05:10:40+05:30 IST