పాక్షిక లాక్‌డౌన్‌ అమలుకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-05-06T04:19:05+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ అమలుకు బుధవారం కావలిలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

పాక్షిక లాక్‌డౌన్‌ అమలుకు పటిష్ట చర్యలు
కావలి: నిర్మానుష్యంగా ఆర్వోబీ వంతెన

మధ్యాహ్నం నుంచి మూతపడ్డ దుకాణాలు

జన సంచారం లేక బోసిపోయిన రోడ్లు

కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు 

కావలి, మే 5: కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ అమలుకు బుధవారం కావలిలో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. పాక్షిక లాక్‌డౌన్‌తో మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలు మూతపడగా పట్టణంలో పోలీసులు వాహనాలు తిరగకుండా రోడ్డుకు అడ్డంగా స్టాపర్లు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. కడప, ఉదయగిరి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు పట్టణంలోకి రాకుండా ఆర్వోబీ వంతెన మీదుగా నేరుగా తుమ్మలపెంట రోడ్డు మీదుగా హైవేకు వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో పట్టణంలో ఒంటి గంట నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసాద్‌రావు హెచ్చరించారు.  

ఆత్మకూరు: ఆత్మకూరులో కరోనా కట్టడికి ఆంక్షలు కొనసాగుతున్నాయి. మఽధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ విధించడంతో దుకాణాలు మూతప డ్డాయి. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అయితే కర్ఫ్యూ వేళల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయడంలో చూపిన శ్రద్ధ కర్ఫ్యూకు ముందు పట్టీపట్టనట్లు వదిలేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మఽధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, కూరగాయల మార్కెట్‌, బ్యాంకులు, మందుల షాపుల వద్ద ప్రజలు గుమికూడటం కనిపించింది. ఆత్మకూరు స్టేట్‌ బ్యాంకు వద్ద ఉదయం ఖాతాదారుల రద్దీ ఉంది. కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని డిఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-06T04:19:05+05:30 IST