కరోనా గాయానికి రుణ సాయం

ABN , First Publish Date - 2021-06-19T04:56:36+05:30 IST

కరోనా కల్లోలం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంటి పెద్దను కోల్పోయి ఎంతో మంది దిక్కులేని వారయ్యారు. సంపాదించే మనిషి దూరమవడంతో ఆర్థికంగా తలకిందులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారికి జాతీయ ఎస్సీ, బీసీ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం రుణమిచ్చి ఆదుకోనుంది. దీనితో ఆ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందవచ్చు. అన్ని అర్హతలు కలిగిన కుటుంబాలకు రూ.5లక్షలను రుణంగా ఇవ్వనుంది. అందులో 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా గాయానికి రుణ సాయం

ఎస్సీ, బీసీలకు రూ.5లక్షల వరకు రుణం

21వరకు దరఖాస్తుకు గడువు


నెల్లూరు (వీఆర్సీ), జూన్‌ 18 : కరోనా కల్లోలం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంటి పెద్దను కోల్పోయి ఎంతో మంది దిక్కులేని వారయ్యారు. సంపాదించే మనిషి దూరమవడంతో ఆర్థికంగా తలకిందులైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వారికి జాతీయ ఎస్సీ, బీసీ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం రుణమిచ్చి ఆదుకోనుంది. దీనితో ఆ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందవచ్చు. అన్ని అర్హతలు కలిగిన కుటుంబాలకు రూ.5లక్షలను రుణంగా ఇవ్వనుంది. అందులో 20 శాతం సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. 


అర్హతలు... అవసరమైన పత్రాలు

బాధితులు ఎస్సీ, బీసీ కులాలకు చెందిన వారై ఉండాలి.

కొవిడ్‌ -19తో మృతి చెందిన వ్యక్తి వయసు  18 - 60 ఏళ్లలోపు ఉండాలి.

ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.3లక్షలలోపు ఉండాలి.

భార్యభర్తలలో ఒకరు మరణిస్తే రెండో వారు ఈ రుణానికి అర్హులు

తల్లిదండ్రులు కొవిడ్‌తో మరణిస్తే వారి పిల్లలు మైనర్లు అయితే సంరక్షకులు సంబంధిత తహసీల్దారు ద్వారా ధ్రువీకరణ పత్రమును జతచేసిన యెడల వారు కూడా ఈ పథకానికి అర్హులు.

రేషన్‌, ఆధార్‌ కార్డుతోపాటు బ్యాంకు పాస్‌ బుక్‌ కాపీని, మరణ ధ్రువీకరణ పత్రాన్ని వార్డు, గ్రామ సచివాలయాలలో  సమర్పించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాలి.

Updated Date - 2021-06-19T04:56:36+05:30 IST