గ్రంథాలయ పన్ను జమ చేయాలని వినతి

ABN , First Publish Date - 2021-10-30T05:08:55+05:30 IST

మండలంలోని 25 పంచాయతీల్లో వసూలైన పన్ను నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన పన్ను చెల్లించేలా చొరవ చూపాలని ఈవోపీఆర్డీ శ్రీనివాసులుకు

గ్రంథాలయ పన్ను జమ చేయాలని వినతి

అనంతసాగరం, అక్టోబరు 29: మండలంలోని 25 పంచాయతీల్లో వసూలైన పన్ను నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన పన్ను చెల్లించేలా చొరవ చూపాలని ఈవోపీఆర్డీ శ్రీనివాసులుకు స్థానిక శాఖ గ్రంథపాలకుడు డి.నారాయణరావు శుక్రవారం విన్నవించారు. 2020-21 వరకు సుమారు రూ 2.16 లక్షలు బకాయి ఉన్నట్లు గుర్తుచేశారు. చెల్లించాల్సిన ఈ పన్ను త్వరగా చెల్లించేలా చూడాలని కోరారు.

Updated Date - 2021-10-30T05:08:55+05:30 IST