లక్ష్యాలను పూర్తి చేయకపోతే సస్పెన్షన్‌ తప్పదు

ABN , First Publish Date - 2021-08-22T03:54:16+05:30 IST

ల్లాలో 46 మండలాల్లో 9.80 లక్షల మొక్కలను నాటడంలో భాగంగా, అన్ని మండలాలకు లక్ష్యాలు కేటాయించారని, ఈ లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యం చేస్తే , నిర్దాక్షిణ్యంగా సస్పెండ్‌ చేస్తామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ తిరుపతయ్య హెచ్చరించారు.

లక్ష్యాలను పూర్తి చేయకపోతే సస్పెన్షన్‌  తప్పదు
క్షేత్ర సహాయకుల రికార్డులను పరిశీలిస్తున్న డ్వామా పీడీ తిరుపతయ్య

కోట, ఆగస్టు 21 : జిల్లాలో 46 మండలాల్లో 9.80 లక్షల మొక్కలను నాటడంలో భాగంగా, అన్ని మండలాలకు లక్ష్యాలు కేటాయించారని, ఈ లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యం చేస్తే , నిర్దాక్షిణ్యంగా  సస్పెండ్‌ చేస్తామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ తిరుపతయ్య హెచ్చరించారు. శని వారం కోటలోని ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. క్షేత్ర సహాయకుల పనితీరును పరిశీలించారు.  అనంతరం  మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు జిల్లాలో 5.50 లక్షల మొక్కలను నాటాలన్నారు. మొక్కలను తీసుకొని, నాటకుండా సాకులు చెబితే ఉపేక్షించేది లేదన్నారు.   పంచాయతీల వారీగా మండలాల సిబ్బందికి కొన్ని పనులు కేటాయించామన్నారు.  ఎంపీడీవో భవాని, ఏపీవో విజయమ్మ, టెక్నికల్‌ అసిస్టెంట్లు సుమన్‌, శాంతి,  తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-08-22T03:54:16+05:30 IST