సంగమేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

ABN , First Publish Date - 2021-08-28T04:45:35+05:30 IST

సంగం పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు.

సంగమేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

సంగం, ఆగస్టు 27: సంగం పెన్నానది ఒడ్డున వెలసిన కామాక్షిదేవి సమేత సంగమేశ్వరాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా భక్తులు లేకుండా బద్వేల్‌కు చెందిన బహ్మశ్రీ కనుమళ్ల సత్యనారాయణస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కామాక్షిదేవికి అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించి వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం కుంకుమను మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో వెళ్లి పెన్నానది జలాల్లో నిమజ్జనం చేశారు. కమతం కృష్ణారెడ్డి వేదపండితులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోటు కరుణాకర్‌రెడ్డి, కర్నాటి రవీంద్రరెడ్డి, గంగపట్నం చంద్రశేఖరయ్య, సూరా శ్రీనివాసులురెడ్డి, గ్రంధి గోపికృష్ణ, కమతం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:45:35+05:30 IST