ప్రవాహంలో కొట్టుకు పోయిన గొర్రెలు

ABN , First Publish Date - 2021-11-29T03:04:06+05:30 IST

కలుజు ప్రవాహంలో 30 గొర్రెలు కొట్టుకుపోయిన సంఘటన డక్కిలి మండలం నరసనాయుడుపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకొంది.

ప్రవాహంలో కొట్టుకు పోయిన గొర్రెలు

డక్కిలి, నవంబరు 28 : కలుజు ప్రవాహంలో 30 గొర్రెలు కొట్టుకుపోయిన సంఘటన డక్కిలి మండలం నరసనాయుడుపల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకొంది. బాధితుల కథనం ప్రకారం.. నరసనాయుడుపల్లికి చెందిన మునగాల రవి, వెంకటసుబ్బయ్య, పొటేళ్ల మల్లికార్జున ఆదివారం సాయంత్రం మేత అనంతరం గొర్రెలను తీసుకువస్తుండగా,  కొత్తచెరువు కలుజు మీదుగా వస్తున్న ప్రవాహంలో కొట్టుకు పోయాయి. వీటి విలు సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.  ఉదయం మేతకు వెళ్లే సమయంలో కలుజు పెద్దగా పారలేదని చెప్పారు. సాయంత్రం గొర్రెలు కలుజు ప్రవాహాన్నిదాటుతండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో గొర్రెలన్నీ కొట్టుకు పోయాయని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.Updated Date - 2021-11-29T03:04:06+05:30 IST