కొట్టుకుపోయిన దక్షిణ కాలువ గేటు!

ABN , First Publish Date - 2021-11-27T03:03:22+05:30 IST

కలువాయి చెరువు నుంచి సోమశిల దక్షిణ కాలువకు నీరు విడుదల చేసే రెగ్యులేటర్‌ గేటు శుక్రవారం కొట్టుకుపోయింది

కొట్టుకుపోయిన దక్షిణ కాలువ గేటు!
గేటు కొట్టుకుపోవడంతో కాలువలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

కలువాయి, నవంబరు 26: కలువాయి చెరువు నుంచి సోమశిల దక్షిణ కాలువకు నీరు విడుదల చేసే రెగ్యులేటర్‌ గేటు శుక్రవారం కొట్టుకుపోయింది  సోమశిల నుంచి కలువాయి చెరువుకు నీటిని విడుదల చేసి అక్కడి నుంచి ఆయకట్టుకు తరలిస్తారు.  కలువాయి చెరువు  రెగ్యులేటర్‌ గేటు తెరచి నీరు విడుదల చేసిన కొద్దిసేపటికే పెద్ద శబ్దంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో దక్షిణ కాలువలో సామర్థ్యం కంటే ఎక్కువగా నీరు వస్తుండడంతో పొంగి కలువాయి, సీతారాంపల్లి రోడ్డుపై ప్రవహించింది.  సమాచారం తెలుసుకున్న సోమశిల 6వ డివిజన్‌ ఈఈ మల్లికార్జున, డీఈఈ వెంకటేశ్వర్లు ఏఈఈ నారాయణరాజు దక్షిణ కాలువకు ఒక చోట గండి కొట్టి ప్రవాహాన్ని మళ్లించారు. రెగ్యులేటర్‌ నుంచి నీరు వృఽథా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-11-27T03:03:22+05:30 IST