కొలువుదీరిన పాలకవర్గం

ABN , First Publish Date - 2021-11-23T05:39:21+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. నగర మేయర్‌గా పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్లుగా రూప్‌కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఎన్నికయ్యారు.

కొలువుదీరిన పాలకవర్గం
కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకుడితో మేయర్‌, డిప్యూటీ మేయర్లు; బుచ్చి చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేస్తున్న సుప్రజ

నెల్లూరు నగర పాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. నగర మేయర్‌గా పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్లుగా రూప్‌కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఎన్నికయ్యారు. ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి చక్రధర్‌బాబు, జిల్లా ఎన్నికల పరిశీలకుడు బసంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా  మోర్ల సుప్రజ, డిప్యూటీ చైర్మన్లుగా కోటంరెడ్డి లలిత, షేక్‌ షాహుల్‌ ప్రమాణస్వీకారం చేశారు.

Updated Date - 2021-11-23T05:39:21+05:30 IST