కేంద్రం మొండి వైఖరి నశించాలి

ABN , First Publish Date - 2021-02-07T04:51:46+05:30 IST

వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత అన్నారు.

కేంద్రం మొండి వైఖరి నశించాలి

వెంకటగిరి(టౌన్‌), ఫిబ్రవరి 6: వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత అన్నారు. శనివారం స్థానిక క్రాస్‌రోడ్డు వద్ద 565 జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని 70 రోజులుగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.   ఎల్‌ఐసీ, రైల్వే, బీపీసీఎల్‌, విశాఖ స్టీల్‌ వంటి సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబలకు అనుమతివ్వడం అంటే దేశ ప్రజలకు ద్రోహాన్ని తలపెట్టడమేనని దుయ్యబట్టారు.  రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి.వి. రమణయ్య, పీ. బాలకృష్ణయ్య, లక్ష్మీరెడ్డి, సుబ్బరాయుడు కె. అజిత, రత్నమ్మ, సీహెచ్‌ చిన ఓబయ్య, ఈశ్వరయ్య, సుబ్బరాయులు, గౌస్‌బాషా, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T04:51:46+05:30 IST