నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-12-08T04:24:51+05:30 IST

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు లక్ష్య సాధనలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో శీనానాయక్‌ హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : ఆర్డీవో
మాట్లాడుతున్న ఆర్డీవో శీనానాయక్‌

వరికుంటపాడు, డిసెంబరు 7: ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు లక్ష్య సాధనలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో శీనానాయక్‌ హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలస్థాయి అధికారులు సమన్వయంతో ఓటీఎస్‌ నగదు వసూళ్లకు ప్రణాళికలు రూపొందించుకోవాన్నారు. సంఘబంధాల సభ్యులకు సైతం అవగాహన కల్పించి పొదుపు రుణాల ద్వారా నగదు చెల్లించేలా చూడాలన్నారు. కాగా సచివాలయ ప్రత్యేకాధికారులు ఎలాంటి సమాచారం లేకుండా సమావేశానికి హాజరు కావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇకనైనా ప్రత్యేక వ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతివారం కనీసం వంద మంది నగదు చెల్లించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విరువూరు సచివాలయాన్ని సందర్శించి నగదు చెల్లించిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందచేశారు. తోటలచెరువుపల్లిలో చుక్కల భూములు పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సారయ్య, తహసీల్దారు హేమంత్‌కుమార్‌, ఎంపీడీవో సురే్‌షబాబు, పీఆర్‌ఏఈ రవీంద్రనాథ్‌, ఏపీఎం వైనారూత్‌, హౌసింగ్‌ డీఈఈ శ్రీనివాసులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ నాయబ్‌రసూల్‌, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T04:24:51+05:30 IST