జెండా మోసిన కార్యకర్తలకు క్రమపద్ధతిలో ఆదరణ
ABN , First Publish Date - 2021-10-21T03:28:56+05:30 IST
కష్టకాలంలో పార్టీ జెండాను భుజాలపై మోసిన కార్యకర్తలకు క్రమ పద్ధతిలో ఆదరణ లభిస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి
చిట్టమూరు, అక్టోబర్ 20 : కష్టకాలంలో పార్టీ జెండాను భుజాలపై మోసిన కార్యకర్తలకు క్రమ పద్ధతిలో ఆదరణ లభిస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల వైసీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో చిట్టమూరు మండల ఎంపీపీగా సన్నారెడ్డి విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించా. ఈ సందర్భంగా నిర్వహించి అభినందన సభలో ఆయన మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ... చిట్టమూరు ఎంపీపీ ఎన్నిక సన్నారెడ్డి పార్టీకి చేసిన సేవల ఫలితమేనని అన్నారు. కుటుంబం అన్నాక కష్టాలుంటాయని, పార్టీని వీడరాదని దువ్వూరు వర్గానికి పరోక్షంగా తెలియజేశారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, తదితరులు ఎంపీపీ వియలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ రైతు విభాగం కార్యదర్శి రామోహన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బద్దిగ వెంకటరమణయ్య, కస్తూరిరెడ్డి, పల్లంపర్తి శ్రీనివాసులురెడ్డి, రాధారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సుధీర్‌రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ మస్తాన్ ఎంపీడీవో సురేష్‌బాబు, తహసీల్దార్ మునిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.