నల్లబ్యాడ్జీలతో మున్సిపల్‌ కార్మికులు నిరసన

ABN , First Publish Date - 2021-06-22T03:00:30+05:30 IST

తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కావలిలో మున్సిపల్‌ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు, త

నల్లబ్యాడ్జీలతో మున్సిపల్‌ కార్మికులు నిరసన
నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

కావలి,జూన్‌21: తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కావలిలో మున్సిపల్‌ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్‌ వర్క్‌ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లె అంకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే  పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు.


Updated Date - 2021-06-22T03:00:30+05:30 IST