కాపునేస్తం మంజూరు కాలేదని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-10T06:38:40+05:30 IST

తలుపూరుపాడులో అర్హత ఉన్నా తొమ్మిది మందికి కాపునేస్తం మంజూరు కాలేదని బాధితులు సోమవారం గ్రామ నాయకులు బాబు ఆధ్వర్యంలో ఎంపీడీవో

కాపునేస్తం మంజూరు కాలేదని ఫిర్యాదు

సంగం, ఆగస్టు 9: తలుపూరుపాడులో అర్హత ఉన్నా తొమ్మిది మందికి కాపునేస్తం మంజూరు కాలేదని బాధితులు సోమవారం గ్రామ నాయకులు బాబు ఆధ్వర్యంలో ఎంపీడీవో నాగేంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సచివాలయం నుంచి తన లాగిన్‌కు పంపించేటప్పటికి పోర్టల్‌ నిలిపేశారని, దీంతో పెండింగ్‌లో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే ప్రతిపాదనలు పంపుతానని తెలిపారు.

Updated Date - 2021-08-10T06:38:40+05:30 IST