మున్సిపాలిటీని జగన్‌కు కానుకగా అందిస్తాం..

ABN , First Publish Date - 2021-03-15T04:05:40+05:30 IST

వెంకటగిరి మున్సిపాలిటీ లోని 25వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవడంతో ఈ మున్సిపాలిటీని జగన్‌కు కానుకగా

మున్సిపాలిటీని జగన్‌కు కానుకగా అందిస్తాం..
గెలిచిన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే ఆనం

- ఎమ్మెల్యే ఆనం

వెంకటగిరి(టౌన్‌), మార్చి 14: వెంకటగిరి మున్సిపాలిటీ లోని 25వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవడంతో ఈ మున్సిపాలిటీని జగన్‌కు కానుకగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలతోనే గెలవగలిగామన్నారు. ప్రతి పథకం ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిందన్నారు. పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, కౌన్సిలర్‌ను సన్మానించారు.  కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు మెట్టుకూరు ధనంజయరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-15T04:05:40+05:30 IST