వైభవంగా కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన

ABN , First Publish Date - 2021-12-08T04:15:56+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం అమ్మవారికి వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ జరిగింది.

వైభవంగా కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన
జొన్నవాడ ఆలయంలో గోపూజ చేస్తున్న సినీ రచయిత ఆకుల శివ

 బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 7:  మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం అమ్మవారికి వైభవంగా లక్ష కుంకుమార్చన పూజ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన తెలుగు సినీ రచయిత ఆకుల శివ, ఉదయకీర్తి దంపతులు ఈ పూజలకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ముందుగా ఆయన తన కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు మొక్కు నిమిత్తం అభిషేకం, నవావరణ  పూజలు చేశారు. అనంతరం లక్ష కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆకుల శివ దంపతులను స్వామి, అమ్మవార్ల శేష వస్ర్తాలతో సత్కరించి ఆశీర్వదించారు. ముందుగా ఆయన కుటుంబసభ్యులతో ఆలయంలో శాస్ర్తోక్తంగా గోవు పూజ నిర్వహించారు. అనంతరం వారి గోత్ర నామాలతో గోపూజ, వస్త్రదానం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మి, మురారి, కృష్ణ, తులసి. నాయక్‌ తదితర సినిమాలకు కథ, మాటలు, రచయితగా పనిచేశానని  తెలిపారు. 

ఈ సందర్భంగా ఆకుల శివ దంపతులు 42 గ్రాముల 223 మిల్లీ గ్రాముల బంగారు ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డికి అందజేశారు. 


కామాక్షితాయికి బంగారు ఆభరణం 

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో మంగళవారం యూఎస్‌ఏకు చెందిన పాముల రమేష్‌, రాధిక దంపతులు కామాక్షితాయికి 61.440 మిల్లీ గ్రాముల లక్ష్మీదేవి డాలరు, లక్ష్మీదేవి ప్రతిమలతో హారం (స్వర్ణాభరణాలు) బహూకరించారు. ముందుగా  హారం, డాలరును అమ్మవారికి అలంకరించి, వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆభరణాలను ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డికి అందజేసి రసీదు పొందినట్లు తెలిపారు. దాతలను స్వామి, అమ్మవార్ల శేష వస్ర్తాలు అందజేశారు.Updated Date - 2021-12-08T04:15:56+05:30 IST