కక్ష సాధింపులను ఎదుర్కొంటాం..
ABN , First Publish Date - 2021-03-25T04:20:33+05:30 IST
కోట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని ఓటమి అంచులదాకా తీసుకెళ్లినందుకు ఆ పార్టీలోని కొంతమంది నాయకులు తమ కార్యకర్తలు, తనపై కక్షకట్టి ఇబ్బందులకు గరిచేస్తున్నారని, ఈ ప్రయత్నాలు మానుకోకపోతే న్యాయంతో ఎదుర్కొంటామని టీడీపీ మండల కన్వీనర్ సర్వోత్తమరెడ్డి హెచ్చరించారు.

కోట, మార్చి 24 : కోట పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని ఓటమి అంచులదాకా తీసుకెళ్లినందుకు ఆ పార్టీలోని కొంతమంది నాయకులు తమ కార్యకర్తలు, తనపై కక్షకట్టి ఇబ్బందులకు గరిచేస్తున్నారని, ఈ ప్రయత్నాలు మానుకోకపోతే న్యాయంతో ఎదుర్కొంటామని టీడీపీ మండల కన్వీనర్ సర్వోత్తమరెడ్డి హెచ్చరించారు. కోటలో బుధవారం సర్వోత్తమరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మండల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. పట్టణంలోకి వెళ్లే పంటకాలువను తాను ఆక్రమించినట్లు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదన్నారు. గ్రామానికి చెందిన తన్నీరు రత్నయ్య నుంచి ఆ భూమిని తాను కొనుగోలుచేస్తే ఆక్రమించానని వైసీపీ నాయకులు ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఆ పార్టీ నాయకులు చేసే తప్పులను ఎదిరించిన తమ కార్యకర్తల దుకాణాలు ఆస్తులపై దాడులు చేయించడం మంచిపద్ధతి కాదన్నారు. న్యాయం కోసం తాముచేస్తున్న ఈ పోరాటంలో ఎలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తలొంచే పరిస్థితే లేదని సర్వోత్తమరెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, వెంకన్నపాళెం సర్పంచ్ మధుయాదవ్, షంషుద్దీన్, తీగల సురేష్‌బాబు, దారా సురేష్, అనిల్, నౌషాద్, తదితరులు ఉన్నారు.