కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ
ABN , First Publish Date - 2021-11-06T05:15:54+05:30 IST
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం తిమ్మరాజు పేటలో శనివారం నుంచి జరగనున్న 69వ అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా మహిళల, పురుషుల కబడ్డీ జట్లను గురువారం ఎంపిక చేశారు.

కోవూరు, నవంబరు 5 : విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం తిమ్మరాజు పేటలో శనివారం నుంచి జరగనున్న 69వ అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా మహిళల, పురుషుల కబడ్డీ జట్లను గురువారం ఎంపిక చేశారు. కబడ్డీ క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. మహిళల కబడ్డీ జట్టు కెప్టెన్‌గా కే జాగృతిని ఎంపిక చేశారు. జట్టు క్రీడాకారులుగా లక్ష్మి, తులసి, హన్నా, రాజేశ్వరి (నెల్లూరు), నాగమణి (బంగారుపాళెం), కార్తీక (అల్లూరు), హైమవతి, మైథిలీ (కావలి), హరీష(కొత్తకోడూరు), మహేశ్వరి (కమ్మవారిపాళెం), కళ్యాణి (చెర్లోపాళెం) ఎంపికయ్యారు. టీమ్ మేనేజరుగా తరుణ్, కోచ్‌గా బాబు వ్యవహరిస్తారు. పురుషుల జట్లు కెప్టెన్‌గా టీ శ్రావణకుమార్ (సోమరాజుపల్లె) ఎంపికయ్యారు. జిల్లా జట్టు క్రీడాకారులుగా వీ గోపాల్ (కావలి), నవీన్‌కుమార్, యాకోబు (ముదివర్తి), వీ సాయి, హనీత్ (లేగుంటపాడు), సుధీర్ (బుచ్చిరెడ్డిపాళెం), హనీఫ్ (నెల్లూరు), పూర్ణచంద్ (కొత్తూరు), శ్రీధర్, సతీష్, దేవాదత్, (కోవూరు) ఎంపికయ్యారు. టీమ్ మేనేజరుగా సుబానీబాషా, కోచ్‌గా నరేష్ ఎంపికయ్యారు. దుస్తులు పంపిణీ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారుడు మహేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లవకుమార్, ఉపాధ్యక్షుడు పూండ్ల డేవిడ్ జాన్సన్, సహాయ కార్యదర్శి జూగుంట విజయానందం, ఈసీ సభ్యులు లక్ష్మీకాంతం, శ్రీనివాసులు, రాజా, వార్డెన్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సీఎం కప్ క్రీడా పోటీలు
ఇందుకూరుపేట, నవంబరు 5 : రాష్ట్ర స్థాయిలో జరిగే సీఎం కప్ క్రీడా పోటీలకు మండల స్థాయి నుంచి కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు ఎంపీడీవో రఫీఖాన్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి మండలంలోని కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16ఏళ్లు నిండి, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోటీల్లో పాల్గొన వచ్చునన్నారు. అథ్లెటిక్స్ క్రీడలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాల్గొనే వారు నేరుగా రావడం లేదంటే ముందుగా ఎంఈవో శ్రీహరి బాబు వద్ద పేరు నమోదు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం కప్ పోటీలకు దరఖాస్తు చేసుకోండి
తోటపల్లిగూడూరు : మండలస్థాయిలో నిర్వహించనున్న సీఎం కప్ పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కన్నం హేమలత తెలిపారు. శుక్రవారం పోటీల వివరాలు వెల్లడించారు. సీఎం కప్ పోటీలకు సంబంధించి అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్ట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ క్రీడల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ క్రీడలకు 17ఏళ్ల నుంచి 27ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులని ఎంపీడీవో స్పష్టం చేశారు. సీఎం కప్ క్రీడల్లో పాల్గొనదలచిన వారు వివరాలను జడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పి.జ్యోతిని సంప్రదించాలని తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.