రేపటి నుంచి కబడ్డీ జట్లకు శిక్షణ

ABN , First Publish Date - 2021-10-30T03:19:47+05:30 IST

పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం నుంచి జిల్లా కబడ్డీ జట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.తులసిరెడ్డి తెలిపారు.

రేపటి నుంచి కబడ్డీ జట్లకు శిక్షణ
ఎంపికైన జిల్లా కబడ్డీ జట్ల క్రీడాకారులు

కోవూరు, అక్టోబరు 29: పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం నుంచి జిల్లా కబడ్డీ జట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ర్తీ, పురుషుల జట్లకు తర్ఫీదు ఇవ్వనున్నామన్నారు. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మండలం తిమ్మరాజుపేటలో నవంబరు 6 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న 69వ అంతర జిల్లాల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్లు పాల్గొననున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి లవకుమార్‌, ఉపాధ్యక్షుడు పూండ్ల డేవిడ్‌ జాన్సన్‌, సహాయ కార్యదర్శి జూగుంట విజయానందం, ఈసీ సభ్యులు సింహాద్రి ప్రవీణ్‌, పెంచలయ్య, రాజా, శ్రీను, శివాజీ, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:19:47+05:30 IST