జేవీవీలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి

ABN , First Publish Date - 2021-03-22T07:46:37+05:30 IST

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ప్రజలు జనవిజ్ఞాన వేదికలో భాగస్వామ్యులు కావాలని జేవీవీ రాష్ట్ర నేతలు శంకరయ్య, బుజ్జయ్య, నగర నేత చలపతిరావు పిలుపునిచ్చారు.

జేవీవీలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి
పోస్టర్‌ విడుదల చేస్తున్న నేతలు

సభ్యత్వ నమోదులో నాయకులు


నెల్లూరు(వైద్యం), మార్చి 21 : శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ప్రజలు జనవిజ్ఞాన వేదికలో భాగస్వామ్యులు కావాలని జేవీవీ రాష్ట్ర నేతలు శంకరయ్య, బుజ్జయ్య, నగర నేత చలపతిరావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జేవీవీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజ విజ్ఞానం, మూఢనమ్మకాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో జేవీవీ ముందుంటుందన్నారు. కరోనా సమయంలోనూ వలస కూలీలకు అండగా నిలిచిందన్నారు. అనంతరం జేవీవీ సభ్యత్వ నమోదు పోస్టర్లను విడుదల చేశారు, మొదటి సభ్యత్వాన్ని డాక్టర్‌ శ్రీనునాయక్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో మాదాల రాము, విజయకుమార్‌, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T07:46:37+05:30 IST