జూన్‌ నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి

ABN , First Publish Date - 2021-05-19T04:58:00+05:30 IST

జూన్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వ లేఅవుట్‌ల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ అధికారులను మండల ప్రత్యేకాధికారి ప్రదీప్‌కుమార్‌ కోరారు.

జూన్‌ నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి
ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి ప్రదీప్‌కుమార్‌

మనుబోలు, మే 18: జూన్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వ లేఅవుట్‌ల్లో ఇళ్ల నిర్మాణాలు   ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ అధికారులను మండల ప్రత్యేకాధికారి ప్రదీప్‌కుమార్‌ కోరారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం గృహనిర్మాణశాఖ అధికారులతో పాటు ఇతర అధికారులతో పేదలందరికీ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ మొదటి విడతలో 1,050 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో మండలంలోని మనుబోలు, గురివిందపూడి, మడమనూరు, కాగితాలపూరు, పిడూరు, బండేపల్లి పంచాయతీల్లో ఉన్న లేఅవుట్లలో 522 ఇళ్లు, స్వంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకోలేని 522 మందికి ఇళ్లు  నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఒక్కో ఇంటికి రూ.1.8లక్షలు ఇవ్వనుందన్నారు. లబ్ధిదారులే కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలన్నారు. నెలాఖరులోగా  వీరికి సంబందించిన మ్యాపింగ్‌, రిజిస్ర్టేషన్‌ కార్యక్రమాలను గృహనిర్మాణశాఖ సిబ్బంది పూర్తి చేయాలన్నారు. నిర్మాణం ప్రారంభించేలోపు లేఅవుట్లలో నీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖల ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారన్నారు. రెండో విడతలో మండలంలో 1,200ఇళ్ల వరకు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నాగరాజు, డీఈఈ వరప్రసాద్‌రావు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ శరత్‌బాబు, శ్రీనువాసులు, డీఈవో కవిత, ఏఈలు రవికుమార్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T04:58:00+05:30 IST