జిల్లాలో ఓటీఎ్‌సకు 2 లక్షల మందికి అర్హత

ABN , First Publish Date - 2021-12-20T03:30:36+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న శాశ్వత గృహక్కు (ఓటీఎస్‌) పథకానికి జిల్లాలో 2 లక్షల మంది లబ్ధిదారులకు అర్హత ఉన్నట్లు గుర్తించామని జేసీ విదే్‌హఖరే పేర్కొన్నారు.

జిల్లాలో ఓటీఎ్‌సకు 2 లక్షల మందికి అర్హత
అధికారులకు సూచనలిస్తున్న జేసీ విదే్‌హఖరే

జేసీ విదే్‌హఖరే 

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న శాశ్వత గృహక్కు (ఓటీఎస్‌) పథకానికి జిల్లాలో 2 లక్షల మంది లబ్ధిదారులకు అర్హత ఉన్నట్లు గుర్తించామని జేసీ విదే్‌హఖరే పేర్కొన్నారు. ఆదివారం ఉదయగిరికి వచ్చిన ఆయన పట్టణంలోని సచివాలయం-1లో ఓటీఎస్‌ పథకంపై అధికారులు, సచివాలయ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం సంస్థ నుంచి 1983 నుంచి 2011 వరకు రుణం తీసుకున్న వారు 2 లక్షల మంది ఉండగా అందులో ఇప్పటి వరకు 60 వేల మంది స్వచ్ఛందంగా ఓటీఎస్‌లో నగదు చెల్లించారన్నారు. ఓటీఎస్‌ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.20 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. నోలోన్‌ కింద గుర్తింపబడిన లబ్ధిదారులు 70 వేల మంది ఉన్నారన్నారు. వీరికి రూ.10లకే పక్కాగృహం రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయగిరి మండలంలో 70 శాతం ఓటీఎస్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, హౌసింగ్‌ ఏఈ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T03:30:36+05:30 IST