ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2021-10-30T03:30:12+05:30 IST
ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ గషేణ్ కుమార్ పేర్కొన్నారు.

జేసీ గణేష్ కుమార్
కావలి రూరల్, అక్టోబరు 29: ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ గషేణ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని తుమ్మలపెంట పంచాయతీలో ప్రభుత్వ పథకాలు అమలుపై శుక్రవారం ఆయన అకస్మిక తనిఖీ చేపట్టారు. సిటిజన్ అవుట్ రిచ్ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లిన ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. వలంటీర్లు పథకాలపై అవగాహన కల్పిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. జేసీ మాట్లాడుతూ ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నివేదికను యాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్, డీఎల్పీవో రమేష్, ఎమ్పీడీవో ఏవీ సుబ్బారావు, ఏపీఎం కాంతారావు, పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.