ఓటీఎస్‌ వేగవంతం చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2021-12-20T03:32:24+05:30 IST

బోగోలు మండలంలో ఓటీఎస్‌ను వేగవంతం చేయాలని జేసీ గణేష్‌కుమార్‌ అన్నారు.

ఓటీఎస్‌ వేగవంతం చేయాలి : జేసీ
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ

బిట్రగుంట, డిసెంబరు 19: బోగోలు మండలంలో ఓటీఎస్‌ను వేగవంతం చేయాలని జేసీ గణేష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం బోగోలు పంచాయతీ బిట్‌-1 సచివాలయంలో ఓటీఎస్‌పై ఎంపీడీవో నాసరరెడ్డి, వీఆర్వో కిరణ్‌కుమార్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో  8,422 లబ్ధిదారులకు గాను 6014 మంది వివరాలు వలంటరీలకు అందచేశామని, అందులో 4,284 లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 1,260 మంది ఓటీఎస్‌ నగదు చెల్లించారన్నారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T03:32:24+05:30 IST