రోడ్లు బాగుచేయండి బాబూ..

ABN , First Publish Date - 2021-09-04T03:11:50+05:30 IST

మరమ్మతులకు గురైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ శుక్రవారం జనసేన నాయకులు ఉదయగిరి ఆనకట్ట సమీపంలో రహదారిపై మోకాళ మీద నిలబడి నిరసన తెలిపారు.

రోడ్లు బాగుచేయండి బాబూ..
ఉదయగిరి ఆనకట్ట సమీపంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు

జనసేన నాయకుల నిరసన

ఉదయగిరి, సెప్టెంబరు 3 : మరమ్మతులకు గురైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ శుక్రవారం జనసేన నాయకులు ఉదయగిరి ఆనకట్ట సమీపంలో రహదారిపై మోకాళ మీద నిలబడి నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితి దారుణంగా ఉందని దుయ్యబట్టారు. ఉదయగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పాలకులు పట్టించుకోలేదన్నారు. తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తిం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సురేంద్రరెడ్డి, కృష్ణ, నరేంద్ర, కిరణ్‌కుమార్‌, హరికృష్ణ, శ్రీను, వెంకట్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T03:11:50+05:30 IST