చుక్కల భూముల సమస్యపై జనసేన పోరుబాట

ABN , First Publish Date - 2021-08-28T04:40:04+05:30 IST

జనసేనాని పవన్‌కళ్యాణ్‌ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని జనసేన

చుక్కల భూముల సమస్యపై జనసేన పోరుబాట

ఆత్మకూరు, ఆగస్టు 27 : జనసేనాని పవన్‌కళ్యాణ్‌ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌లో చుక్కల భూముల రైతులకు న్యాయం జరగాలని, జీవో నెంబర్‌ 216ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా తరహాలో మిగిలిన జిల్లాలో సైతం చుక్కల భూముల సమస్యను సుమోటాగా స్వీకరించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పూజల నాగమల్లేశ్వరరావు, పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు, బీజేపీ నేతలు చెరుకూరు రమణయ్యనాయుడు, నలిశెట్టి శ్రీనివాసులు, కొగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-28T04:40:04+05:30 IST