ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష

ABN , First Publish Date - 2021-10-22T03:45:54+05:30 IST

స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద గురువారం ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు జనాగ్రహదీక్ష నిర్వహించారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష

గూడూరు  అక్టోబరు 21:  స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద గురువారం ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు జనాగ్రహదీక్ష నిర్వహించారు.  రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళీధర్‌రావు, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, బొమిడి శ్రీనివాసులు, చేవూరు విజయమోహన్‌రెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, మగ్దూం, మురళి పాల్గొన్నారు.

వెంకటగిరి(టౌన్‌):  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ  డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నక్కా వెంకటేశ్వర రావు, వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరి కృష్ణ, లక్కమనేని కోటీశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు  కోలా వెంకటేశ్వర్లు, ఎంపీపీ తనూజ రెడ్డిపాల్గొన్నారు. 

కోట : విద్యానగర్‌ గాంధీబొమ్మ సెంటర్‌లో గురువారం వైసీపీ నాయకులు ప్రజాగ్రహ దీక్ష చేశారు.  దేవారెడ్డి నాగూర్‌రెడ్డి మాట్లాడారు.

Updated Date - 2021-10-22T03:45:54+05:30 IST