ద్వితీయ ఇంటర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు

ABN , First Publish Date - 2021-07-13T04:00:20+05:30 IST

: ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ఎస్‌కేఆర్‌ఎస్‌ డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ద్వితీయ ఇంటర్‌కు ఆన్‌లైన్‌ క్లాసులు
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌, డీవీఈవో డాక్టర్‌ ఆదూరి శ్రీనివాసులు

బుచ్చిరెడ్డిపాళెం,జూలై 12:  ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు ఎస్‌కేఆర్‌ఎస్‌ డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌,  డీవీఈవో డాక్టర్‌ ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు.   బుచ్చి కళాశాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లెక్చరర్ల ద్వారా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి, ఆగ్రూపుల్లో విద్యార్థులను చేర్చి జూమ్‌ యాప్‌ద్వారా వారికి బో

ధిస్తామని తెలిపారు. జిల్లా, కళాశాల స్థాయిలో సీనియర్‌ అధ్యాపకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి లెక్చరర్లకు సంబంధించి అన్ని సమాచారాలను జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు లేని 17 మండలాల్లో మంచి హైస్కూళ్లు, మోడల్‌ స్కూళ్లు ఎంపిక చేసుకుని ఆ స్కూల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 


Updated Date - 2021-07-13T04:00:20+05:30 IST