చెస్‌ టోర్నీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-08T07:28:12+05:30 IST

నెల్లూరులోని జీపీఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం ఓపెన్‌ చెస్‌ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి ప్రారంభించారు

చెస్‌ టోర్నీ ప్రారంభం
చెస్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఫిబ్రవరి 7: నెల్లూరులోని జీపీఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం ఓపెన్‌ చెస్‌ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి ప్రారంభించారు. కరోనా అనంతరం క్రీడా పోటీలకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా నిర్వహణకు ఎవరూ సాహసించడం లేదని, ఇటువంటి పరిస్థితిలో చెస్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో కొవిడ్‌ అనంతరం 84 మంది టోర్నీలో పాల్గొనడం ఇదే ప్రథమం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై సుమన్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్‌, నిర్వాహకులు రామ్‌లక్ష్మణ్‌, శివవంశీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T07:28:12+05:30 IST