మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-08-21T03:29:18+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలని జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం అమలు చేయాలి
జాతీయ శాస్త్రీయ స్పృహ దినోత్సవంంలో జేవీవీ ప్రతినిధులు

గూడూరురూరల్‌, ఆగస్టు 20: తెలుగు రాష్ట్రాల్లో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలని జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండు సమీపంలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జాతీయ శాస్త్రీయ స్పృహ దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయన్నారు. మూఢనమ్మకాల మత్తులో చదువుకున్నవారు కూడా కన్నబిడ్డలను చంపుతున్నారన్నారు. ఎంతో మంది దొంగస్వాములు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో చెంచునారాయణ, సాయికిరణ్‌, వెంకట్‌, అశోక్‌, గోపీ, ప్రభాకర్‌, మస్తాన్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T03:29:18+05:30 IST