ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-05-31T03:03:22+05:30 IST

తమను ఆదుకోవాలని ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమసంఘం అధ్యక్షుడు సుధాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు.

ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

గూడూరురూరల్‌, మే 30: తమను ఆదుకోవాలని ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమసంఘం అధ్యక్షుడు సుధాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా శుభకార్యాలు జరగకపోవడంతో పనులు లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి  ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో గణేష్‌, రాఘవేంద్రరావు, గజానన, ప్రసాద్‌, యూసఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-31T03:03:22+05:30 IST